- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జన్మతః పౌరసత్వం రద్దుపై వ్యతిరేకత.. కోర్టులో దావా వేసిన 22 రాష్ట్రాలు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తన అధికారాలను అతిక్రమించారని, అమెరికా రాజ్యాంగాన్ని అతిక్రమించి.. దేశంలో జన్మించే పిల్లలకు ఆటోమెటిక్‌గా సంక్రమించే పౌరసత్వ హక్కును కాలరాస్తున్నారని ఆ దావాల్లో పేర్కొన్నారు.

- విడిగా కేసులు వేస్తున్న పలు పౌర హక్కుల సంఘాలు
- ట్రంప్ నిర్ణయం అమలు కావడం సాధ్యమేనా?
దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాకు రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో జన్మతః పౌరసత్వం రద్దు కూడా ఉంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న తల్లికి పుట్టే పిల్లలకు ఇకపై ఆటోమెటిక్‌గా పౌరసత్వం సంక్రమించదు. సదరు పిల్లల తండ్రి చట్టబద్దంగా అమెరికాలో ఉన్నా.. వారు పౌరసత్వం పొందడానికి అనర్హులే అవుతారు. కాగా, ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని కోర్టుల్లో పలు దావాలు దాఖలు చేశారు. అమెరికా పౌర హక్కుల సంఘం, వలసదారుల ఆర్గనైజేషన్లు, ప్రెగ్నెంట్ మదర్స్ కొంత మంది కలసి రెండు కేసులు ఫైల్ చేశారు. డెమోక్రటిక్ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల ప్రభుత్వాల కూటమి ఒక కేసు వేయగా.. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, సిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కోలు బోస్టన్, సియాటెల్‌లో వేర్వేరు దావాలు దాఖలు చేశాయి.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తన అధికారాలను అతిక్రమించారని, అమెరికా రాజ్యాంగాన్ని అతిక్రమించి.. దేశంలో జన్మించే పిల్లలకు ఆటోమెటిక్‌గా సంక్రమించే పౌరసత్వ హక్కును కాలరాస్తున్నారని ఆ దావాల్లో పేర్కొన్నారు. ట్రంప్ సంతకం చేసిన ఆర్డర్‌ను అమలు చేయడానికి అనుమతి ఇస్తే ఏటా ఏటా అమెరికాలో జన్మించే 1.5 లక్షల మంది పిల్లల హక్కును నిరాకరించినట్లు అవుతుందని మసాచుసెట్స్ అటార్నీ జనరల్ ఆండ్రియా జాయ్ క్యాంప్‌బెల్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగపరమైన హక్కులను తొలగించే అధికారం ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఉండవని ఆమె తెలిపారు. అమెరికా రాజ్యాంగం (1868) 14వ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించే ఎవరికైనా జన్మతః పౌరసత్వ హక్కు సంక్రమిస్తుందని ఆండ్రియా పేర్కొన్నారు.
ఒక ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌తో జన్మతః వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయడం సాధ్యపడదని, ఇది అనేక న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనేక మంది పౌరులను నిరాశ పరిచేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఇది చివరకు కోర్టుల్లోనే తేలుతుంది. ట్రంప్ ఒక్కడే ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోలేడని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్ ప్రొఫెసర్ సాయికృష్ణ ప్రకాశ్ తెలిపారు.






