Commonwealth Games : ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్.. ఖర్చు ఎంతంటే?

by Muthe.Rajitha |   (  Updated:2025-11-30 13:31:37  IST  )

2030 కామన్‌వెల్త్ గేమ్స్ భారత్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Commonwealth Games : ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్.. ఖర్చు ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : 2030 కామన్‌వెల్త్ గేమ్స్ భారత్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇటీవల స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన CGF జనరల్ అసెంబ్లీలో 74 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అహ్మదాబాద్‌ లో జరుపనున్న ఈ ఈవెంట్‌ను ₹3,000 నుంచి ₹5,000 కోట్ల బడ్జెట్‌తో నిర్వహించాలని గుజరాత్ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే అహ్మదాబాద్‌ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం వంటి వేదికలను ఉపయోగించుకోవాలని, కొత్త నిర్మాణాలు చేపట్టకుండా ఖర్చును అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

2010 ఢిల్లీ గేమ్స్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వివాదాలు, పొరబాట్లు జరగకుండా ఈవెంట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసి, పూర్తి ఖర్చు అంచనాలు ఖరారు చేయనున్నారు. ఈ గేమ్స్ 2036 ఒలింపిక్స్ బిడ్‌కు భారత్‌కు మార్గం సుగమం చేసే అడుగుగా భావిస్తున్నారు.

Next Story