దళపతి విజయ్ సభలో 20 మంది మృతి.. CM స్టాలిన్ దిగ్భ్రాంతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-27 15:37:12  IST  )

దళపతి విజయ్(Thalapathy Vijay) సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

దళపతి విజయ్ సభలో 20 మంది మృతి.. CM స్టాలిన్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్(Thalapathy Vijay) సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి(20 People Dead)చెందారు. మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) స్పందించారు. దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. కాగా, శనివారం కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. పరిస్థితి గమనించిన విజయ్‌ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు. భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story