అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 18ఏళ్ల కుర్రాడు.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

బీహార్‌లో వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. 18ఏళ్ల కుర్రాడు కన్నయ్య 50ఏళ్ల స్త్రీ జ్యోతి దేవిని పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కాడు. నిజానికి వీరి లవ్ స్టోరీ గుజరాత్‌లో ప్రారంభమైంది. కూలీ పని చేస్తుండగా కలుసుకున్న ఇద్దరు.. ప్రేమలో పడిపోయారు. జ్యోతి దేవికి నలుగురు పిల్లలు.

అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 18ఏళ్ల కుర్రాడు.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో వింత ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. 18ఏళ్ల కుర్రాడు కన్నయ్య 50ఏళ్ల స్త్రీ జ్యోతి దేవిని పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కాడు. నిజానికి వీరి లవ్ స్టోరీ గుజరాత్‌లో ప్రారంభమైంది. కూలీ పని చేస్తుండగా కలుసుకున్న ఇద్దరు.. ప్రేమలో పడిపోయారు. జ్యోతి దేవికి నలుగురు పిల్లలు. కాగా వారికి కూడా పిల్లలు పుట్టారు. మనవలు, మనవరాళ్లతో హ్యాపీగానే ఉంది. కానీ కన్నయ్య ఎంటర్ కావడంతో కథలో కీలకమలుపు చోటు చేసుకుంది. ఆమెకు ప్రపోజ్ చేసి.. బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉన్న తన గ్రామం పక్కీసరాయ్‌కు తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు. కాగా అమ్మమ్మ అయిపోయిన మహిళ ఇలాంటి పని చేయడంపై సిగ్గుపడుతున్నారు జ్యోతి కుటుంబ సభ్యులు. కాగా కూతుళ్లు, అల్లుళ్లు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story