తల్లిదండ్రులను కిరాతకంగా కాల్చి చంపిన కూతురు.. అంత్యక్రియల్లో ఏడుపు.. ఎమోషనల్ పోస్టులు.. కానీ ఇలా దొరికింది..??

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-12 12:00:13  IST  )

తల్లిదండ్రులను హత్య చేసి.. టిక్ టాక్ వీడియోల్లో సంతాపం తెలిపిన పదిహేడేళ్ల బాలిక కేసు వైరల్ అవుతోంది. జార్జియాకు చెందిన సారా గ్రేస్ పాట్రిక్‌‌ను తన తల్లి క్రిస్టిన్ బ్రాక్ (41), స్టెప్ ఫాదర్ జేమ్స్ బ్రాక్ (45) హత్యలకు సంబంధించి అరెస్టు చేశారు పోలీసులు

తల్లిదండ్రులను కిరాతకంగా కాల్చి చంపిన కూతురు.. అంత్యక్రియల్లో ఏడుపు.. ఎమోషనల్ పోస్టులు.. కానీ ఇలా దొరికింది..??
X

దిశ, వెబ్ డెస్క్ : తల్లిదండ్రులను హత్య చేసి.. టిక్ టాక్ వీడియోల్లో సంతాపం తెలిపిన పదిహేడేళ్ల బాలిక కేసు వైరల్ అవుతోంది. జార్జియాకు చెందిన సారా గ్రేస్ పాట్రిక్‌‌ను తన తల్లి క్రిస్టిన్ బ్రాక్ (41), స్టెప్ ఫాదర్ జేమ్స్ బ్రాక్ (45) హత్యలకు సంబంధించి అరెస్టు చేశారు పోలీసులు. కరోల్ కౌంటీ‌లో ఉన్న తమ ఇంట్లో బెడ్‌రూమ్‌లో గన్‌షాట్ గాయాలతో మృతి చెందగా.. వారి ఆరెళ్ల కుమార్తె శవాలను గుర్తించి.. సారాను అప్రమత్తం చేసింది. దీంతో ఆమె 911కి కాల్ చేసింది.

కరోల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది. FBI, జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో సహా స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ ఏజెన్సీలు కూడా పాల్గొన్నాయి. ఫిజికల్, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా సారాను అరెస్టు చేశారు అధికారులు. ఇంటిలో బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేకపోవడం, దొంగతనం లాంటివి జరగకపోవడం.. ఇంట్లో ఉన్నవారిపైనే అనుమానం పెంచింది. కాగా సారా.. హత్యల సమయంలో 16 ఏళ్ల వయస్సులో ఉంది. దోషిగా నిర్ధారణ అయితే జీవిత ఖైదు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. మరిన్ని అరెస్టులు సాధ్యమని అధికారులు చెప్తున్నారు. హత్యకు ఖచ్చితమైన ఉద్దేశం ఇంకా స్పష్టం కాలేదు.

సోషల్ మీడియాలో..

హత్యల తర్వాత సారా టిక్‌టాక్‌లో తన తల్లిదండ్రుల మరణాన్ని గురించి భావోద్వేగ వీడియోలు పోస్ట్ చేసింది. ఇవి సానుభూతిని పొందాయి. మార్చి 1న హత్యలు జరిగిన 10 రోజుల తర్వాత.. ‘తల్లిదండ్రులను చాలా మిస్ అవుతున్నాను... నీవు లేని ఈ జీవితం చాలా బాధాకరం’, ‘మామ్ మిస్ యూ’ లాంటి పోస్టులు పెట్టింది. అంతేకాదు ఇతర టిక్ టాక్ క్రియేటర్స్‌కు తన తల్లిదండ్రుల కేసు కవర్ చేయమని కూడా కోరింది. తన తల్లిదండ్రుల అంత్యక్రియలలో కాటలిస్ట్ చర్చ్‌లో భావోద్వేగ ప్రసంగం చేసింది. తన తల్లిని ‘ బ్యూటిఫుల్ సోల్’గా వర్ణించింది. అయితే ఈ విషయం బయటపడ్డాక ఆమె మొసలి కన్నీరు కార్చిందని విమర్శిస్తున్నారు.

VIDEO

Next Story