- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ యాక్సిడెంట్స్.. 16 మంది మృతి
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 16 మంది చనిపోగా.. 45 మందికి గాయాలయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 16 మంది చనిపోగా.. 45 మందికి గాయాలయ్యాయి. సింధ్ ప్రావిన్స్ లోని ఖైర్పూర్ సమీపంలోని రాణిపూర్ దగ్గర బస్సు రిక్షాను డీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఆ యాక్సిడెంట్ లో 35 మందికి గాయలయ్యాయి. అలాగే, షహీద్ బెనజీరాబాద్ జిల్లాలోని ఖాజీ అహ్మద్ పట్టణం సమీపంలో మరో యాక్సిడెంట్ జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్.. ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందగా.. 10మంది గాయపడ్డారు. వేగంగా ప్రయాణిస్తున్న వ్యాను.. ఓ వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వివరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జంషోరో జిల్లాలోని సెహ్వాన్ నగరంలోని లాల్ షాబాజ్ ఖలందర్ మందిరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.






