UN: మరో 48 గంటల్లో 14 వేల చిన్నారులు చనిపోయే ఛాన్స్.. గాజా పరిస్థితిపై యూఎన్ ఆందోళన

by Shamantha N |

గాజాపై ఇజ్రాయెల్‌ (Israel- Gaza conflict) భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ పరిమితంగానే మానవతా సాయానికి అనుమతి ఇస్తోంది.

UN: మరో 48 గంటల్లో 14 వేల చిన్నారులు చనిపోయే ఛాన్స్.. గాజా పరిస్థితిపై యూఎన్ ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్‌ (Israel- Gaza conflict) భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ పరిమితంగానే మానవతా సాయానికి అనుమతి ఇస్తోంది. దీంతో, ఆ ప్రాంతంలో తిండిలేక ప్రజలు విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. మానవతా సాయం ఇలాగే కొనసాగితే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. యూఎన్ ప్రతినిధి టామ్ ప్లేచర్ మాట్లాడుతూ.. ‘‘చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందింది. అక్కడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వారికి మరింత సాయం అవసరం. లేదంటే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉంది. అక్కడున్న చిన్నారులు, తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు’’ అని హెచ్చరించారు.

పాలస్తీనా భూభాగం..

11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్‌ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. అయితే, ఈ విషయంలోనూ ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ఫ్రాన్స్, కెనడాలు తీవ్రంగా ఖండించాయి. గాజాకు మానవతా సాయంపై తమ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. అంతేకాకుండా, టెల్ అవీవ్ తీరుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించాలంది. చిన్నారుల ప్రాణాలు రక్షించాలని కోరింది.

Next Story