- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు ఈ సూసైడ్ లెటర్ చూసే సమయానికి స్వర్గంలో ఉంటా.. మైనర్ ఆత్మహత్య..
నెట్‌ఫ్లిక్స్ ‘డెత్ నోట్’ సిరీస్ చూశారా? లైట్ యాగామి అనే ఓ విద్యార్థికి ఓ నోట్ బుక్ దొరుకుతుంది. ఇందులో ఎవరి పేరు తలుచుకుని, వారి ఫొటోను ఈ డెత్ నోట్ బుక్‌లో గీస్తాడో వాళ్లు మరణిస్తారు. దీంతో అతను నేరస్థులను చంపాలని నిర్ణయించుకుంటాడు. ఒకరి వెనుక

దిశ, వెబ్ డెస్క్ : నెట్‌ఫ్లిక్స్ ‘డెత్ నోట్’ సిరీస్ చూశారా? లైట్ యాగామి అనే ఓ విద్యార్థికి ఓ నోట్ బుక్ దొరుకుతుంది. ఇందులో ఎవరి పేరు తలుచుకుని, వారి ఫొటోను ఈ డెత్ నోట్ బుక్‌లో గీస్తాడో వాళ్లు మరణిస్తారు. దీంతో అతను నేరస్థులను చంపాలని నిర్ణయించుకుంటాడు. ఒకరి వెనుక మరొకరు చనిపోతుండగా.. అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఓ ఆఫీసర్ నియమించబడుతాడు. ఈ క్రమంలో విద్యార్థికి, ఆఫీసర్‌కు మధ్య ఓ వార్ లాగా సాగుతుంది కథ. దీంతో ఎత్తు మీద పైఎత్తు వేస్తున్న విద్యార్థి.. కొన్ని తప్పులు చేస్తాడు. చివరకు చనిపోతాడు. ఇది కథ.
అయితే ఈ సిరీస్ చూసిన బెంగళూరు బాలుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరీస్‌లో తనను తాను ఊహించుకున్నాడో లేక తప్పుగా ప్రభావితమయ్యాడో తెలియదు కానీ ‘నా టైం వచ్చింది.. మీరు ఈ లెటర్ చూసే సమయానికి స్వర్గంలో ఉంటా’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఓ క్యారెక్టర్ ఇమేజ్ కూడా పెయింట్ చేశాడు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినిమాలు, సిరీస్‌ల ప్రభావంపై చర్చ జరుగుతోంది.






