- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
133 మిలియన్ల బాలికలు చదువుకు దూరం : UNESCO
నవనాగరిత వైపు ప్రపంచం దూసుకు పోతున్నప్పటికీ... ప్రపంచంలో ఇంకా అసమానతలు కొనసుగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : నవనాగరిత వైపు ప్రపంచం దూసుకు పోతున్నప్పటికీ... ప్రపంచంలో ఇంకా అసమానతలు కొనసుగుతూనే ఉన్నాయి. ఈ అసమానతల్లో ముఖ్యమైంది జెండర్ ఈక్వాలిటీ. అన్ని రంగాల్లో మహిళలు ముందు వరుసలో ఉన్నప్పటికీ... అది ప్రపంచవ్యాప్తంగా లేకవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక కార్యకర్తలు. యునెస్కో(UNSCO)కు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్(GEM) నిర్వహించిన సర్వేలో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 133 మిలియన్ల బాలికలు చదువుకు దూరంగా ఉంటున్నట్టు యునెస్కో సర్వే చెబుతోంది.
GEM రిపోర్టు ప్రకారం... ప్రాథమిక విద్యా స్థాయిలో 91 మిలియన్ల మంది బాలికలు, సెకండరీ విద్యా స్థాయిలో 136 మిలియన్ల మంది బాలికలు పాఠశాలల్లో చేరారు. అయినప్పటికీ ఇంకా 133 మిలియన్ల బాలికలు పాఠశాలల బయట ఉండటం ఆందోళనకరమైన విషయం. 30 ఏళ్ల తర్వాత కూడా సవాళ్లు1995లో జరిగిన బీజింగ్ సమ్మేళనంలో మహిళలకు మరియు బాలికలకు సమాన అవకాశాలను కల్పించేందుకు చేసిన చారిత్రాత్మక డిక్లరేషన్ ప్రకారం.. మహిళల హక్కులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై ప్రపంచ దేశాలు సంతకాలు చేసాయి.
అయితే, ఈ డిక్లరేషన్ అమలులోకి వచ్చి మూడు దశాబ్దాలు గడిచినా, పాఠశాలల బయట ఉన్న బాలికల సంఖ్యలో భారీ మార్పు ఏమీ లేకపోవడం పట్ల జీఈఎం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కుటుంబ ఆర్థిక కారణాలు, అవగాహనా లోపం, స్కూల్ వాతావరణంలో రక్షణ లేకపోవడం, విద్యా మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాల వలన బాలికల డ్రాప్ ఔట్లు గణనీయంగా ఉన్నట్టు పేర్కొంది.






