Arunachal: అరుణాచల్ ప్రదేశ్ లో వర్షాలు.. 12 మంది మృతి

by Shamantha N |

ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వరద పరిస్థితి భయంకరంగానే ఉంది.

Arunachal: అరుణాచల్ ప్రదేశ్ లో వర్షాలు.. 12 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వరద పరిస్థితి భయంకరంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అరుణాచల్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల వల్ల 23 జిల్లాల్లో 3,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు గల్లంతయ్యారని.. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అరుణాచల్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) నివేదిక తెలిపింది. చాంగ్లాంగ్ జిల్లా అత్యంత ప్రభావిత జిల్లా అని అధికారులు తెలిపారు. ఆ జిల్లాలోని ఆరు గ్రామాలు మునిగిపోయాయని.. 2,231 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఆకస్మిక వరదల వల్ల ట్రాన్స్-అరుణాచల్ హైవేలోని మకాంటాంగ్ వంతెన ధ్వంసమయ్యింది. మియావో, బోర్డుమ్సా మధ్య రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. మియావో సబ్ డివిజన్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పశువులు, ఉద్యానవన ఆస్తుల్లో గణనీయమైన నష్టాలు సంభవించాయని అధికారులు తెలిపారు. చాంగ్లాండ్‌లోని నోవా-డెహింగ్ నదికి సమీపంలో ఉన్న జుప్రా, రివర్ కేఫ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు వరద నీటితో మునిగిపోయాయి. అరుణాచల్ వ్యాప్తంగా మొత్తం 212 ఇళ్లు దెబ్బతిన్నాయని, వెయ్యికి పైగా పశువులు చనిపోయాని పేర్కొంది.

Next Story