- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసి అశ్లీల వీడియోలు.. కామాంధుడి ఇంటిపై జేసీబీ యాక్షన్
మహారాష్ట్రలో 180 మంది మైనర్ బాలికలను వేధించిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని (Maharashtra) అమరావతి జిల్లాలో వెలుగుచూసిన దారుణమైన లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సుమారు 180 మంది మైనర్ బాలికలను వాట్సాప్ స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ట్రాప్ చేసి వారిని లైంగికంగా వేధించడమే కాకుండా అశ్లీల వీడియోలు చిత్రీకరించాడో నీచుడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడు మహమ్మద్ అయాజ్ (Mohammad Ayaz) అలియాస్ తన్వీర్ (19) ఇంటిపై అధికారులు బుల్డోజర్ (Bulldozer) ట్రీట్ మెంట్ ఇచ్చారు. సదరు రాక్షసుడి ఇంటి వద్ద అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే స్వయంగా ఈ చర్యను పర్యవేక్షించారు.
బ్లాక్ మెయిల్ వ్యభిచార కూపంలోకి:
నిందితుడు అయాజ్ దారుణాలు సంచలనం రేపాయి. సోషల్ మీడియా వేదికల ద్వారా మైనర్ బాలికలను "లవ్ ట్రాప్" లోకి దింపిన నిందితుడు వారిని ముంబై, పుణే వంటి నగరాలకు తీసుకెళ్లి సుమారు 350 వరకు అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియోలతో బాలికలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని వ్యభిచార కూపంలోకి నెట్టినట్లు రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏప్రిల్ 11న అతడిని అరెస్ట్ చేశారు.
నిందితుడికి ఎంఐఎంతో లింక్ ఆరోపణలు!
నిందితుడు అయాజ్ గతంలో AIMIM (ఎంఐఎం) పార్టీలో పనిచేశాడని, ఆ పార్టీ అమరావతి అధ్యక్షుడు హాజీ ఇర్ఫాన్ ఖాన్ నుంచి నియామక పత్రం అందుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఎంఐఎం పార్టీ ఖండించింది. అయాజ్ కేవలం గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా బాధ్యతలు చూశాడని, పనితీరు బాగోలేక అప్పుడే అతడిని పార్టీ నుంచి బహిష్కరించామని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజీబ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అయాజ్‌తో పాటు ఉజర్ ఖాన్ అనే మరో వ్యక్తిని మరియు మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయాజ్, ఉజర్‌లు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులోని అశ్లీల వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.






