100 శాతం నేను సీఎం అభ్యర్థినే.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
100 శాతం నేను సీఎం అభ్యర్థినే.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థుల్లో ఒకరినని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తనకు పోటీగా ఉన్నారనే వార్తలపై ఆయన స్పందించారు. ‘100 శాతం నేను సీఎం అభ్యర్థినే. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే డీకే శివకుమార్ కూడా నాతో పాటు జాబితాలో ఉన్నారు. పరమేశ్వర గురించి నాకు తెలియదు.

గతంలో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ.. ఇందులో తప్పేమి లేదు’ అని అన్నారు. తాను కొలార్ నుంచి బరిలోకి దిగుతారని ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా మే 10న కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య తీవ్ర పోరు ఉండగా, జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది.


Next Story