- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీతానగరం ఘటనపై నివేదిక కోరిన ఎస్సీ, ఎస్టీ కమిషన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఎస్సీ యువకుడిపై పోలీస్ స్టేషన్లో దాడి, శిరోముండనం ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ స్పందించింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు కమిషన్‌కు లేఖ రాసింది. సంఘటనకు కారణమైన మొత్తం నిందితుల పేర్లు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. వర్ల రామయ్య మాట్లాడుతూ ఇకపై […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఎస్సీ యువకుడిపై పోలీస్ స్టేషన్లో దాడి, శిరోముండనం ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ స్పందించింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు కమిషన్‌కు లేఖ రాసింది. సంఘటనకు కారణమైన మొత్తం నిందితుల పేర్లు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. వర్ల రామయ్య మాట్లాడుతూ ఇకపై దళితులపై ఎటువంటి దాడులు జరిగినా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, పార్టీ తరుపున వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ప్రకటించారు.
Next Story






