ఆనంద్ మహీంద్రాకు రిటర్న్ గిఫ్ట్ పంపిన నటరాజన్

by  |
ఆనంద్ మహీంద్రాకు రిటర్న్ గిఫ్ట్ పంపిన నటరాజన్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో అద్బుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా అరంగేట్రం క్రికెటర్లకు ఆనంద్ మహీంద్రా థార్ వాహనాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నటరాజన్ తాను అందుకున్న థార్ వాహనంతో ఫొటోలు దిగి గురువారం ట్విట్టర్‌లో పంచుకున్నాడు. తమిళనాడుకు చెందిన నటరాజన్ ఐపీఎల్‌లో ప్రదర్శన ద్వారా ఆస్ట్రేలియాకు నెట్ బౌలర్‌గా ఎంపికై ఆ తర్వాత మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తన అద్భుత బౌలింగ్‌తో టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నటరాజన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్‌లకు కూడా ఆనంద్ మహీంద్రా థార్ వాహనాలను అందించారు. కాగా, తన బహుమతిని అందుకున్న తర్వాత ఆనంద్ మహీంద్రకు నటరాజన్ గబ్బా టెస్టులో తాను ధరించిన టీమ్ ఇండియా జెర్సీని సంతకం చేసి పంపించాడు. ‘టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆడే అవకాశం రావడం తనకు దక్కిన వరం. అద్బుతమైన వ్యక్తుల నుంచి నాకు మద్దతు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆనంద్ మహీంద్ర నాకు బహుమతిగా ఇచ్చిన థార్ ఈ రోజే నడిపాను. క్రికెట్ పట్ల మీ ప్రేమ నాకు అర్దం అవుతున్నది. మీ కోసం నా అరంగేట్రం టెస్ట్ గబ్బాలో ధరించిన జెర్సీని సంతకం చేసి పంపుతున్నాను’ అని నట్టూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Next Story

Most Viewed