‘బండి సంజయ్ తల్లి మీద ఒట్టేసి చెబుతాం’

by  |
‘బండి సంజయ్ తల్లి మీద ఒట్టేసి చెబుతాం’
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ వరంగల్ పర్యటనలో భాగంగా అక్కడి ఎమ్మెల్యేలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. వరంగల్ అభివృద్ధిపై భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయాలని అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన్ చాలెంజ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఘాటుగా స్పందించారు. బండి సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. చాలెంజ్‌ను స్వీకరిస్తామన్న నన్నపునేని.. భద్రకాళి అమ్మవారిపై కాకుండా బండి సంజయ్ తల్లి మీద ఒట్టెసి వాస్తవాలు చెబుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు దమ్ముంటే తన తల్లిని తీసుకొని వరంగల్ రావాలని నన్నపునేని ప్రతి సవాల్ విసిరారు.



Next Story

Most Viewed