వెంకీ పెద్ద కుమారుడు వచ్చేశాడు..

114

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన ‘అసుర‌న్’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని తెలుగులో వెంక‌టేశ్ ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన వెంకీ, ప్రియమణి ఫ‌స్ట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది కూడా. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి మరో కొత్త పోస్టర్ విడుదలైంది. నార‌ప్ప పెద్ద కొడుకు ‘మునిక‌న్నా’ లుక్‌ను విడుద‌ల చేశారు.

క్యారెక్టర్ పరంగా గానీ, కథల పరంగా గానీ విక్టరీ వెంకటేష్ చేసిన ప్రయోగాలను ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు ఆదరించారు. తాజాగా ఆయన చేస్తున్న మరో ప్రయోగమే నారప్ప. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో వెంకీ.. ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కడి పాత్రలో కనిపించబోతున్నారు. వెంకీకి జోడీగా ప్రియమణి నటిస్తుండగా.. ఆయన పెద్ద కుమారుడు ‘మునిక‌న్నా’ పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నారు. తాజాగా ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ పతాకాలపై సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ కె నాయుడు ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..