‘బాలు పాటలు చిరకాలం జీవించే ఉంటాయి’

by  |
‘బాలు పాటలు చిరకాలం జీవించే ఉంటాయి’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడిగా, నటుడిగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నాలా లోకేష్ తీవ్ర దింగ్భ్రాంతికి గురయ్యారు. అనేక భాషల్లో పాటలు పాడి అన్ని భాషల ప్రజల్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

‘ఆబాల గోపాలాన్ని త‌న గానంతో అల‌రించిన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూయ‌డం.. సంగీత‌, సాహిత్య, సినీ, క‌ళా ప్ర‌పంచానికి తీర‌నిలోటు. ద‌శాబ్దాలుగా భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ 40 వేల‌కు పైగా పాట‌లు పాడిన సుస్వ‌రాల సుమ‌ధుర బాలు మ‌న‌మ‌ధ్య‌ లేక‌పోవ‌చ్చు. ఆయ‌న పాట‌, మాట‌, బాట‌, న‌ట‌న‌, సంగీతం అన్నీ చిర‌కాలం జీవించే ఉంటాయి. గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబానికి, అశేషాభిమానులకు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను’ అని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.


Next Story

Most Viewed