- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఐదు కోట్ల ఆంధ్రులకు జగన్ జవాబు చెప్పాలి’
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై నారాలోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘స్థానిక యువతకు ఉపాధి కల్పన, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్ తో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధానిగా మహానగరం కడతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు’ అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. జగన్ ఏదైతే చెప్పారో వాటికంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు నిర్మించిన అమరావతి ప్రజారాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జగన్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై నారాలోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘స్థానిక యువతకు ఉపాధి కల్పన, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్ తో ప్రపంచానికే తలమానికంగా నవ్యాంధ్రకు రాజధానిగా మహానగరం కడతానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు’ అంటూ జగన్ పై సెటైర్లు వేశారు.
జగన్ ఏదైతే చెప్పారో వాటికంటే ఘనమైన లక్ష్యాలతో చంద్రబాబు నిర్మించిన అమరావతి ప్రజారాజధానిని ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. జగన్ కట్టాలనుకున్న రాజధాని కంటే గొప్పది చంద్రబాబు కట్టారని కూలగొడుతున్నారా అంటూ లోకేశ్ నిలదీశారు. అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదని మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. జగన్ ఐదు కోట్ల ఆంధ్రులకు సమాధానం చెప్పి తీరాలి అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.






