- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రైతుల ఉసురు జగన్‌కి తగలకమానదు’
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్టర్ వేధికగా హాట్ కామెంట్స్ చేశారు. మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ అంటూ విమర్శించారు. 79 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదని దుయ్యబట్టారు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుక పెట్టని జగన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తా అంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడుముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగిందంటూ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్టర్ వేధికగా హాట్ కామెంట్స్ చేశారు. మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ అంటూ విమర్శించారు. 79 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదని దుయ్యబట్టారు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుక పెట్టని జగన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తా అంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం మూడుముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ మృతి చెందిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాజధాని కోసం 60 సెంట్లు భూమి ఇచ్చిన సామ్రాజ్యం అనే మహిళా రైతు రాజధాని తరలింపు వార్త విని గుండెపోటుతో చనిపోవడం బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేశారు.. తుగ్లక్ నిర్ణయాలతో బలవుతున్న రైతుల ఉసురు జగన్‌రెడ్డికి తగలకమానదని నారా లోకేశ్ శాపం పెట్టారు.






