సీఎం జగన్‌ను చూసి వాత పెట్టుకుంటున్న చంద్రబాబు?

100

దిశ,వెబ్‌డెస్క్ : అదేదో సామెత పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు సైతం సీఎం జగన్‌ను చూసి వాతపెట్టుకుంటున్నారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో జగన్ వైసీపీ పొలికల్ స్ట్రాటజిస్ట్ గా ప్రశాంత్ కిషోర్‌ను నియమించారు. దీంతో టీడీపీ నేతలు సైతం వైసీపీ లిమిటెడ్ పార్టీ అని, ఎక్కువ రోజులుండదని ఎద్దేవా చేశారు. బీహార్ తెలివితేటలు ఇక్క పనికిరావంటూ ప్రశాంత్ కిషోర్ ను టార్గెట్ చేశారు. రోజులు గడిచాయ్. 2018 ఎన్నికల్లో వైసీపీని లిమిటెడ్ పార్టీ అన్న అధికార పార్టీ టీడీపీని గద్దెదించిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలోకి వచ్చేలా పావులు కదిపారు. అయితే తాజా రాష్ట్ర రాజకీయాల్ని పరిశీలిస్తుంటే వైఎస్‌జగన్‌ను..,చంద్రబాబు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోడానికి తాము చేసిన తప్పిదమే కారణమని భావించిన టీడీపీ నేతలు తిరుపతి ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రముఖ రైటర్ రాబిన్ శర్మను టీడీపీ పొలికల్ స్ట్రాటజిస్ట్ గా నియమించున్నట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ తో కలిసి పనిచేశారు. ప్రశాంత్ కిషోర్‌ది ఐ ప్యాక్ అయితే రాబిన్ శర్మది షో టైమ్ పొలిటికల్ కన్సల్టెన్సీ. ఇప్పుడు ఇదే షోటైమ్ పొలిటికల్ కన్సల్టెన్సీ టీడీపీకి పనిచేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తిరుపతి ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సైతం రాబిన్ శర్మను ఫాలో అవుతున్నట్లు టీడీపీ అభిమానులు చెప్పుకుంటున్నారు.