మోహన్ సార్… నా 50వ సినిమా మీరే చేయాలి: నాని

by  |
మోహన్ సార్… నా 50వ సినిమా మీరే చేయాలి: నాని
X

దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో విష్ చేశారు. అయితే నేచురల్ స్టార్ నాని విష్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విష్ యూ హ్యాపీ బర్త్ డే ఎట్ హోమ్ మోహన్ సార్ అని తెలిపిన నాని… నా 50వ సినిమా మీరే చేయాలి… మీ 25వ సినిమా నేనే చేయాలి .. అని కోరుకున్నారు. త్వరలో “వి” టీంతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుందామని తెలిపారు.

కాగా నానిని హీరోగా పరిచయం చేసింది దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టా చమ్మా సినిమా ద్వారా నానిని ఇంట్రడ్యూస్ చేసిన ఆయన… జెంటిల్ మెన్ సినిమాతో రెండోసారి కాంబినేషన్ రిపీట్ చేశారు. ప్రస్తుతం వి మూవీ ద్వారా మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. మార్చిలో రిలీజ్ కావాల్సి ఉన్నా… కరోనా కారణంగా వాయిదా పడింది.

హీరోయిన్ నివేదాథామస్ ఇంద్రగంటి బెస్ట్ విషెస్ అందించింది. మీరు అద్భుతమైన కథలు రాయాలి… అవి సినిమాల ద్వారా ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నానని తెలిపింది. లవ్ యూ సార్.. మీతో కలిసి పని చేయడం, నాన్ స్టాప్ గా నవ్వాలి, సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.

Tags : Nani, Indraganti Mohan Krishna, Niveda Thomas, V Movie, Birthday

Next Story

Most Viewed