65 ఏళ్ల వృద్ధుడిగా నాని?

by  |
65 ఏళ్ల వృద్ధుడిగా నాని?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేచురల్ స్టార్ నాని కెరియర్‌లోనే ది బెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో వస్తున్న శ్యామ్ సింగ రాయ్ ప్రాజెక్ట్‌లో 65 ఏళ్ల వృద్ధుడి పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఈ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుండగా.. ఇందులో ట్రిపుల్ రోల్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. శ్యామ్.. సింగ.. రాయ్‌గా మూడు పాత్రలు చేస్తున్న నాని.. అభిమానులకు నటనావిందు అందించనున్నాడు.

కాగా దసరా కానుకగా మూవీ కాస్ట్ అండ్ క్రూను పరిచయం చేశారు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి సినిమాను నిర్మిస్తున్నారు. సని జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్.

మరోవైపు నాని ‘టక్ జగదీష్’ షూటింగ్ 60 శాతం పూర్తయింది. రీతు వర్మ హీరోయిన్ కాగా.. సినిమాలో మేజర్ పోర్షన్స్ షూటింగ్ కంప్లీట్ అయింది.

Next Story

Most Viewed