కరోనా ఎఫెక్ట్ .. నాని 'వి' విడుదల వాయిదా

by  |
కరోనా ఎఫెక్ట్ .. నాని వి విడుదల వాయిదా
X

దిశ, వెబ్క‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై బాగా ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు బంద్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చిలో విడుదలయ్యే సినిమాలకు బ్రేక్ పడింది.

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేషన్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావు హైదరీ కథానాయికలు. ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 25న ఉగాది శుభాకాంక్షలతో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ప్రేక్షకుల ఆరోగ్యాన్ని, రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తామని తెలిపిన దిల్ రాజు… సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తప్పకుండా వినోదం అందిస్తామన్నారు.

Tags: CoronaVirus, Covid19, Nani, V The Movie, Sudheer Babu, Release Postponed, Dil Raj



Next Story

Most Viewed