రాజమండ్రిలో 'టక్ జగదీశ్'

by  |
రాజమండ్రిలో టక్ జగదీశ్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. ‘నిన్ను కోరి’ సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న ఇద్దరు ఈ సినిమాతో మరోసారి వచ్చేస్తున్నారు. పొల్లాచ్చిలో ఇప్పటికే సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. హీరోయిన్ రీతూ వర్మ, నాని కాంబినేషన్లో సీన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం రాజమండ్రిలో సినిమా సెకండ్ షెడ్యూల్‌ ప్రారంభమైంది. నానిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న మూవీ యూనిట్.. ఓ సాంగ్, యాక్షన్ ఎపిసోడ్ కూడా ఈ షెడ్యూల్‌లోనే ప్లాన్ చేసిందట. సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ కాగా… షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు, నాజర్, మురళీ శర్మ, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నాని ‘వి’ మూవి ఈ నెల 25న విడుదల కానుండగా… ‘టక్ జగదీశ్‌’తో పాటు ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని ప్రకటించాడు నాని. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్‌కు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు నాని.

Tags: V The Movie, Nani, Natural Star, Tak Jagadeesh, Shyam Singaray, Shiva Nirvaana

Next Story

Most Viewed