అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇదే ‘నాంది’ : నాని

by  |
అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇదే ‘నాంది’ : నాని
X

దిశ, సినిమా : తొలి సినిమా ‘అల్లరి’తోనే హిట్ కొట్టేసి ఆ పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్న హీరో నరేష్. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ కామెడీ స్టార్‌.. ‘సుడిగాడు’ మూవీ తర్వాత దాదాపు తొమ్మిదేళ్ల పాటు వరుస పరాజయాలతో సతమతమయ్యాడు. కాగా ఇటీవలే విడుదలైన ‘నాంది’తో విక్టరీ సాధించిన నరేష్, భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లరోడి నటనకు విమర్శకులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే నరేష్ ఆప్తమిత్రుడు నేచురల్ స్టార్ నాని కూడా లడ్డుబాబు నటనకు ఫిదా కాగా, తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

‘ఎట్టకేలకు నాంది చూశాను. రేయ్ రేయ్ రేయ్.. అల్లరి నరేష్ పేరు మార్చేయ్. ఇంక అల్లరి గతం.. భవిష్యత్తుకి ఇది నాంది. చాలా సంతోషంగా ఉంది రా. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని, నీలోని నటుడికి మరింత గుర్తింపుతెచ్చే పాత్రలు రావాలని, చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ నాని ట్వీట్ చేశాడు. నానినే కాదు, చాలా మంది సెలెబ్రిటీలు కూడా నరేష్‌తో ఇదే మాట అన్నారు. నరేష్ కూడా ఇకపై సీరియస్ సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవలే తెలిపాడు. ఇక నాంది సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇతర భాషల్లో రీమేక్ చేసే పనుల్లో ఉన్నట్లు సమాచారం.

అల్లరోడి సర్‌ప్రైజ్ టీజర్.. ‘నాంది’


Next Story

Most Viewed