కొత్త దర్శకుడికి చాన్సిచ్చిన నాని

by  |
కొత్త దర్శకుడికి చాన్సిచ్చిన నాని
X

కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ‘నేచురల్ స్టార్ నాని’ ఎప్పుడూ ముందుంటారు. కథలో కొత్తదనం ఉంటే చాలు.. కొత్త దర్శకులకు చాన్స్ ఇవ్వడంతోపాటు తను ప్రొడ్యూస్ చేసేందుకైనా వెనుకాడడు. ఈ క్రమంలోనే నాని.. కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

దర్శకులు సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్.. నానికి కథ వినిపించగా చాలా ఇంప్రెస్ అయ్యాడట. దీంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేశాడట నాని. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమా బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. శ్రీకాంత్‌ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదాపడ్డ నాని నటించిన ‘వి’ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా.. ఈ ప్రాజెక్టు‌లు పూర్తి కాగానే శ్రీకాంత్ డైరెక్షన్‌లో సినిమా ఉండబోతోందట.

Next Story

Most Viewed