నా క్యారెక్టర్ అది కాదు : నాని

by  |
నా క్యారెక్టర్ అది కాదు : నాని
X

నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్, జెర్సీ’ సినిమాల హిట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత తన తొలి సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ‘వి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ కరోనా వైరస్ అందుకు బ్రేక్ వేసింది. ఈ సినిమాలో నాని నెగెటివ్ రోల్‌లో కనిపిస్తాడని ప్రచారం జరిగినా.. ఫ్లాష్ బ్యాక్‌లో మిలిటరీ మేజర్‌గా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ పోషించాడని తెలిసింది. ప్రస్తుతానికి ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా.. తనకు ‘నిన్ను కోరి’ వంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’ సినిమా పట్టాలెక్కిస్తున్నాడు నాని.

రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ ఇలా ఉండబోతోంది.. అలా ఉండబోతోంది అంటూ ప్రచారం జరిగింది. నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే వ్యక్తిగా కనిపిస్తాడని వార్తలొచ్చాయి. కాగా దీనిపై స్పందించిన నాని.. ఎవడు చెప్పాడు? అని ప్రశ్నించాడు. ఇదంతా నిజం కాదంటూ తన ట్వీట్‌తో ఫేక్ న్యూస్‌కు బ్రేక్ వేయగా.. భలే చెప్పావ్ అన్నయ్యా అంటున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed