శ్యామ్ సింగ రాయ్‌గా నాని అదుర్స్

by  |
శ్యామ్ సింగ రాయ్‌గా నాని అదుర్స్
X

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. నెల రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన ఫ్యాన్స్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నాని 25వ మూవీ ‘వి’ విడుదలకు సిద్ధం కాగా… ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకులను చేరుతుండగా… నాని బర్త్ డే సందర్భంగా మరో చిత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాపై టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో షేర్ చేశారు. సినిమాలో నాని శ్యామ్ సింగరాయ్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా … రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రాన్ని డిసెంబర్ 25, 2020న సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. సినిమా అధికారిక ప్రకటనపై ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. టైటిల్ అదిరిపోయిందని, సినిమా సూపర్ డూపర్‌హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story