ఇక విధ్వంసమే.. చలో శ్రీశైలం..!

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆలయ ఈవో రామారావుపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఘంఠా మఠం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు.. బంగారు నాణేలు, రత్నాలు దొరికితే రాగి రేకుల్ని చూపిస్తున్నారని బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈవో వ్యాఖ్యలను ఖండించిన ఆయన చలో శ్రీశైలంకు పిలుపునిస్తునే.. ఆ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీశైలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. [&hellip;]</p>

ఇక విధ్వంసమే.. చలో శ్రీశైలం..!
X

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆలయ ఈవో రామారావుపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఘంఠా మఠం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు.. బంగారు నాణేలు, రత్నాలు దొరికితే రాగి రేకుల్ని చూపిస్తున్నారని బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈవో వ్యాఖ్యలను ఖండించిన ఆయన చలో శ్రీశైలంకు పిలుపునిస్తునే.. ఆ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీశైలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇలా ఉంటే శ్రీశైలం గుట్ట మీద ఆవు మాంసం తీసుకెళ్తున్నారని తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్‌కు కూడా కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో చలో శ్రీశైలం అంశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story