- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరికృష్ణ సేవలు చిరస్మరణీయం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని
<p>దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ బలోపేతానికి నందమూరి హరికృష్ణ సేవలు చిరస్మరణీయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఆదివారం హరికృష్ణ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ భవన్ లో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని స్థాపించి ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన చైతన్య ప్రచార రథాన్ని వేల కిలో మీటర్లు నడిపిన వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు. హరికృష్ణ ఆశయ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ బలోపేతానికి నందమూరి హరికృష్ణ సేవలు చిరస్మరణీయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. ఆదివారం హరికృష్ణ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ భవన్ లో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని స్థాపించి ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన చైతన్య ప్రచార రథాన్ని వేల కిలో మీటర్లు నడిపిన వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు.
హరికృష్ణ ఆశయ సాధనకోసం మనమంతా కృషిచేద్దామని, పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకొద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, పార్టీ కార్యదర్శి అజ్మీరా రాజునాయక్, నాయకులు గడ్డి పద్మావతి, ఆరీఫ్, జాటోతు ఇందిర, పోలంపల్లి అశోక్, సతీష్ కుమార్, పద్మా చౌదరి, సంజీవరావు, వెంకట్రాజంగౌడ్, సుభాష్ యాదవ్, వెంకట్ రెడ్డి, సూర్యదేవర లత, పద్మావతి, రాఘవులు, రాజశేఖర్, మోహన్ రావు, రత్నాకర్, జగదీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






