జ‌మ్మికుంట కుర్రోడు హీరోగా ‘నందామ‌య‌’

by  |
nandamayya movie
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో కూడా ఓ మంచి సినిమాను నిర్మించ‌వ‌చ్చని నిరూపించారు యువ ద‌ర్శకుడు గోపాల‌కృష్ణ. ఆయ‌న‌ ద‌ర్శక‌త్వంలో జ‌మ్మికుంటకు చెందిన అనిల్ హీరోగా తెరెక్కిన సినిమా నందామ‌య‌. కుటుంబ క‌థాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 13న విడుద‌ల చేసేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. వాగ్దేవి కాలేజ్ పూర్వ విద్యార్థయిన‌ అనిల్ వేల్పుల నందామయ సినిమా పోస్టర్‌ను హ‌న్మకొండ‌లోని క‌ళాశాల‌లో, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ సీహెచ్‌.దేవేందర్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ వాహినిదేవి ఆవిష్కరించారు.

ఈ సినిమాలో న‌టీన‌టులంతా కొత్తవాళ్లే కాగా, కేవ‌లం రూ.3ల‌క్షల‌తోనే సినిమా నిర్మాణం పూర్తి చేయడం గ‌మ‌నార్హం. ఉమ్మడి వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లోని ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. ఈకార్యక్రమంలో వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ శేషాచలం, అకాడమిక్ కో- ఆర్డినేటర్ హరిందర్ రెడ్డి, కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ దత్తాత్రేయ, ఫాకల్టీ మెంబ‌ర్ రాజు, హీరో అనిల్ , నటి డాలియ షరీఫ్, దర్శకుడు గోపాల కృష్ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed