14 ఏళ్ల నామ్యా కపూర్‌కు స్వర్ణం.. ఐశ్వరి ప్రపంచ రికార్డ్

by  |
Rifil-52
X

దిశ, స్పోర్ట్స్: పెరూ రాజధాని లిమా వేదికగా ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 14 ఏళ్ల నామ్యా కపూర్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇదే ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకం గెలుచుకున్నది. నామ్యా 50 షాట్లకు గాను 36 షాట్లు పర్ఫెక్ట్‌గా కొట్టింది. ఇక ఐశ్వరి ప్రతాప్ సింగ్ తొమర్ జూనియర్ పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 1185 పాయింట్లు సాధించి జూనియర్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇక ఫైనల్‌లో 463.4 పాయింట్లతో మరో వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మొత్తానికి జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మొత్తం 8 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచారు.



Next Story

Most Viewed