షాకింగ్: నగ్నంగా మహిళ డెడ్‌బాడీ.. దుప్పట్లో మూట‌క‌ట్టి..

by Vadlamudi Anukaran |

<p>దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహాన్ని దుప్పట్లో మూట కట్టుకొని ఇద్దరు యువకులు తీసుకవెళ్తుండగా గమనించిన స్థానికులు, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన సంఘటన హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని తొర్పూర్ రోడ్డులో బాతుల చెరువు స‌మీపంలో ఇద్దరు యువ‌కులు ఓ మ‌హిళ‌ను హ‌త్య చేసి డెడ్‌బాడీని బ్లాంకెట్ (దుప్పటి)లో చుట్టి చెరువులో ప‌డేసేందుకు తీసుకెళ్లుండగా [&hellip;]</p>

షాకింగ్: నగ్నంగా మహిళ డెడ్‌బాడీ.. దుప్పట్లో మూట‌క‌ట్టి..
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో అమానుష ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ మృత‌దేహాన్ని దుప్పట్లో మూట కట్టుకొని ఇద్దరు యువకులు తీసుకవెళ్తుండగా గమనించిన స్థానికులు, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన సంఘటన హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని తొర్పూర్ రోడ్డులో బాతుల చెరువు స‌మీపంలో ఇద్దరు యువ‌కులు ఓ మ‌హిళ‌ను హ‌త్య చేసి డెడ్‌బాడీని బ్లాంకెట్ (దుప్పటి)లో చుట్టి చెరువులో ప‌డేసేందుకు తీసుకెళ్లుండగా స్థానికులు అడ్డుకున్నారు. మ‌హిళ మృత‌దేహంపై దుస్తులు లేక‌పోవ‌డంతో ఆ యువ‌కులే అత్యాచారం చేసి హ‌త్య చేసి ఉంటార‌ని అనుమానం స్థానికులు వ్యక్తం చేశారు.

యువ‌కుల ప్రవ‌ర్తన అనుమానంగా ఉండ‌డంతో పాటు అడిగిన ప్రశ్నల‌కు పొంత‌న లేని స‌మాధానం చెప్పడంతో స్థానికుల‌కు కోపం వ‌చ్చి యువ‌కుల‌ను చిత‌క‌బాది, అనంత‌రం పోలీసులకు స‌మాచార‌మిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని, మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. యువ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, పూర్తి వివ‌రాలు తెలిపేందుకు నిరాక‌రిస్తున్నారు. పోలీసుల విచార‌ణ‌లో ఎలాంటి నిజాలు బ‌య‌టికి వ‌స్తోయో తెలియాల్సి ఉంది.

Next Story