నాటి నుంచి నేటి వరకు గులాబీ పార్టీలో గుబాళించిన నాగేందర్ గౌడ్

by  |
నాటి నుంచి నేటి వరకు గులాబీ పార్టీలో గుబాళించిన నాగేందర్ గౌడ్
X

దిశ, వికారాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అనగానే నలుగురు అధిష్ఠాన పెద్దలు గుర్తుకు వస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన తనయుడు కేటీఆర్.. కూతురు కవిత.. అల్లుడు హరీష్ రావు లు. ఈ అధిష్టాన పెద్దలతో సాన్నిహిత్యంగా మెలగాలంటే అంత ఆషామాషీ కాదు. తనదైన శైలిలో గులాబీ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఎదిగాడు. ఆ నేత వికారాబాద్ జిల్లా వాసి కావడం ఎంతో గర్వకారణమని పలువురు స్థానిక నాయకులు ప్రశంసిస్తున్నారు. వికారాబాద్ జిల్లా నవపేట్ మండలానికి చెందిన జి.నాగేందర్ గౌడ్ ప్రస్తుతం విద్య మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో ఎంపీపీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2008లో టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పదవి చేపట్టారు. 2008 నుంచి 2017 సంవత్సరం వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. దీంతో అత్యంత సీనియర్ నాయకునిగా సీఎం కేసీఆర్ దృష్టిలో నాగేందర్ గౌడ్ పడ్డారు. ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవర్గంలో ఉద్యమ నాయకులను నడిపించడంలో ముందున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో పరిగిలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన రాళ్ల దాడి జరిపించడంలో సఫలీకృతుడయ్యాడు.

గండిపేటలో జరిగిన తెలుగుదేశం మహానాడు కార్యక్రమం అడ్డుకోవడం.. తాండూరులో జరిగిన టీడీపీ రణభేరి కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో జిల్లా నాయకుడిగా ముందుండి ఉద్యమకారులను నడిపించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి పార్టీకి.. ప్రభుత్వానికి వారధిగా పని చేయడంలో ఎంతో కృషి చేశారు. మొత్తానికి అధిష్టాన పెద్దల దృష్టిలో పడి, 2017 సంవత్సరంలో విద్య మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నాగేందర్ గౌడ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. వికారాబాద్ జిల్లా నుంచి అత్యంత సీనియర్ నేతగా నాగేందర్ గౌడ్ పేరు సంపాదించుకున్నారు.

వికారాబాద్ జిల్లా కు చెందిన వ్యక్తి విద్యార్థి నాయుడి నుంచి విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని పలువురు నాయకులు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇలాంటి పదవులు నాగేందర్ గౌడ్ మరెన్నో అనుభవించాలని పలువురు నాయకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed