ముగియనున్న నామినేషన్ల పర్వం.. చివరితేదీ ఎప్పుడంటే!

by  |
ముగియనున్న నామినేషన్ల పర్వం.. చివరితేదీ ఎప్పుడంటే!
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్లకు తుదిగడువు సమీపించింది. ఓవైపు పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి మినహా అధికార టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.టీడీపీ తరఫున మువ్వ అరుణ్‌కుమార్, బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించకుండానే ఆ పార్టీ నేత నివేదిత నామినేషన్లు దాఖలు చేశారు.

అయితే, టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేందుకు ఇండిపెండెంట్లు పెద్ద మొత్తంలో నామినేషన్లు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 17 పోలింగ్ జరిగే నాగార్జున సాగర్ ఉపఎన్నికకు రేపటితో(మంగళవారం) నామినేషన్ల పక్రియ ముగియనుంది. నామినేషన్ వేయడానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఈరోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఖరారయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు రేపు నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed