- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైటెక్స్‌లో ప్రారంభమైన కిడ్స్ ఫెయిర్ 14 ఎడిషన్.. సందడి చేసిన నాగార్జున..
<p>దిశ, శేరిలింగంపల్లి: చిన్న పిల్లల జీవితాల్లోకి మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని సినీ హీరో అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం హైటెక్స్‌లో భారతదేశంలోనే అతిపెద్ద హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్- 14 ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద కిడ్స్ ఫెయిర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారుల జీవితాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని, పిల్లలే మన భవిష్యత్తు అని అన్నారు. హైటెక్స్ బిజినెస్ హెడ్ […]</p>

దిశ, శేరిలింగంపల్లి: చిన్న పిల్లల జీవితాల్లోకి మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని సినీ హీరో అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం హైటెక్స్‌లో భారతదేశంలోనే అతిపెద్ద హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్- 14 ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద కిడ్స్ ఫెయిర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారుల జీవితాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని, పిల్లలే మన భవిష్యత్తు అని అన్నారు. హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కిడ్స్ ఫెయిర్ పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తుందని తెలిపారు.
విరామ సమయంలో పిల్లలను ప్రశాంతంగా, బిజీగా ఉంచడంలో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతుంటారని అలాంటి వారికి ఈ ఎగ్జిబిషన్ ప్రత్యామ్నాయం చూపుతుందన్నారు. కిడ్స్ ఫెయిర్ 2021లో పిల్లలను నిమగ్నం చేయడానికి, అనేక ఆసక్తికరమైన కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చామని శ్రీకాంత్ తెలిపారు. ఈ ఫెయిర్‌లో 150 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని, పిల్లల ఆటలు, చదువు, విజ్ఞానానికి సంబంధించిన అన్ని రకాల ప్రదర్శనలు ఉన్నాయని అన్నారు. ఈ కిడ్స్ ఫెయిర్‌లో ఫాబీ బేబీ ఫౌండర్ అండ్ సీఈఓ మనోజ్ కంకనే, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






