- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడు కాదు.. సైంటిస్టుల కాళ్లు మొక్కుదాం
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ.. మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా కారణంగా ఇంత మంది చనిపోతున్నారు.. కనీసం ఇప్పుడైనా మారండి అంటూ మతం పేరుతో ఘర్షణలకు దిగుతున్నవారికి హితవు పలికాడు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్పా అని ఇంకా కొట్టుకొని చావకండి అని సూచించాడు. దేవుడి ప్రతినిధులు, స్వామీజీలు ఏమీ చేయలేక గుళ్లు, ప్రార్థన మందిరాలు మూసుకుని కూర్చున్నారన్నాడు. సైంటిస్టులు, డాక్టర్లు ఏ మందు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ.. మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా కారణంగా ఇంత మంది చనిపోతున్నారు.. కనీసం ఇప్పుడైనా మారండి అంటూ మతం పేరుతో ఘర్షణలకు దిగుతున్నవారికి హితవు పలికాడు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్పా అని ఇంకా కొట్టుకొని చావకండి అని సూచించాడు. దేవుడి ప్రతినిధులు, స్వామీజీలు ఏమీ చేయలేక గుళ్లు, ప్రార్థన మందిరాలు మూసుకుని కూర్చున్నారన్నాడు. సైంటిస్టులు, డాక్టర్లు ఏ మందు కనిపెట్టి మమ్మల్ని కాపాడతారా అని ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ఇప్పటికైనా వెళ్లి సైంటిస్టులకు మొక్కుదాం .. కరోనా బారి నుంచి కాపాడేది వాళ్లే తప్పా.. దేవుడో, దేవుడి ప్రతినిధులో కాదు అంటూ ట్వీట్ చేశాడు నాగబాబు.
tags : Nagababu, Jabardasth, CoronaVirus, Corona Effect
Next Story






