నాగ శౌర్య@20.. ప్రీ లుక్

by  |
నాగ శౌర్య@20.. ప్రీ లుక్
X

యంగ్ హీరో నాగ శౌర్య కొత్త చిత్రం గురించి ప్రకటించాడు. ఓ బేబీ, అశ్వద్ధామ లాంటి చిత్రాల సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న శౌర్య.. అంతే సూపర్ ఎనర్జిటిక్‌‌గా తన నెక్స్ట్ ఫిల్మ్ ప్రీ లుక్‌ను రిలీజ్ చేశాడు. కాగా, సూపర్ ఫిట్ బాడీతో ఉన్న శౌర్య బ్యాక్ లుక్ అదిరిపోయింది. ప్రీ లుక్‌తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకున్న శౌర్య.. ఈ చిత్రంపై అంచనాలు పెంచేశాడు. పైగా పురాతన విద్య నేపథ్యంలో సాగుతున్న కథ అని వెల్లడించగా.. మంచి హైప్ క్రియేట్ అయింది. ‘ది గేమ్ విల్ నెవర్ బి ద సేమ్’ అంటూ రిలీజ్ అయిన ప్రీలుక్ మంచి మార్కులే కొట్టేయగా.. సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా శౌర్యకు 20వ చిత్రం కాగా, శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జులై 27న విడుదల చేయనుంది మూవీ యూనిట్. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఉదయం తొమ్మిది గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనుండగా.. ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమా కోసం శౌర్య తన లుక్ పూర్తిగా చేంజ్ చేశాడు.



Next Story