నాగశౌర్య@20.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్

by  |
నాగశౌర్య@20.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్
X

యంగ్ హీరో నాగ శౌర్య 20వ చిత్రం ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇండియన్ సినీ హిస్టరీలో ఆర్చరీ (విలు విద్య) బేస్డ్ ఫస్ట్ సినిమా ఇదే కాగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శౌర్య న్యూ లుక్‌ను అభినందించారు. పక్కింటి అబ్బాయిగా కనిపించే శౌర్య.. సిక్స్ ప్యాక్, లాంగ్ హెయిర్, చేతిలో విల్లుతో అద్భుతంగా ఉన్నాడని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకున్నారు.

‘అతని ఆత్మ, మనసు కలిసి ఉన్నాయి.. లక్ష్యాన్ని చేదించడమే విషయం’ అంటూ ఫస్ట్ లుక్ షేర్ చేశాడు శౌర్య. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రొమాంటిక్ ఫేమ్ కేతికా శర్మ ఈ చిత్రంలో శౌర్యతో జోడీ కట్టబోతుంది. శౌర్య సూపర్ ఇంటెన్సివ్ లుక్‌కు ఫిదా అయినా సమంత, నవదీప్ లాంటి తోటి నటీనటులు సినిమా సక్సెస్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

https://twitter.com/nseplofficial/status/1287610523513577474?s=09



Next Story

Most Viewed