‘లాల్ సింగ్ చద్దా’తో అక్కినేని హీరో బాలీవుడ్ ఎంట్రీ?

by  |
‘లాల్ సింగ్ చద్దా’తో అక్కినేని హీరో బాలీవుడ్ ఎంట్రీ?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. సౌత్ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయాల్సి ఉండగా.. డేట్స్ సర్దుబాటు కాక తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అమీర్ లాస్ట్ మినట్‌లో సేతుపతి ప్రొడ్యూస్ చేస్తున్న ‘విక్రమ్ వేద’ బాలీవుడ్ రీమేక్ నుంచి తప్పుకోవడంతో పాటు ‘లాల్ సింగ్ చద్దా’ కోసం సేతుపతి ప్లేస్‌లో మరో బాలీవుడ్ యాక్టర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ క్యారెక్టర్ గురించి అక్కినేని వారసుడు నాగచైతన్యను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.

1994 అమెరికన్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాతో చై బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య సూపర్ యాక్టింగ్ స్కిల్స్‌తో అదరగొడుతున్న చై డిఫరెంట్ ప్రాజెక్ట్‌లకే ఓకే చెప్తున్నారు. మరి ‘లాల్ సింగ్ చద్దా’కు కూడా ఓకే చెప్పాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తుండగా..ఇప్పటికే తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. మోనా సింగ్ ప్రధానపాత్రలో నటిస్తున్న మూవీలో షారుఖ్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఉండబోతుండగా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అద్వైత్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధికా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



Next Story

Most Viewed