పవన్‌తో పొత్తుకు వైఎస్సార్సీపీ కూడా వెంపర్లాడింది: నాదెండ్ల

by Vemula.Srinu Prasad |

<p>వైఎస్సార్సీపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడిందని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించి కలకలం రేపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, చాలా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా పొత్తు కోసం ప్రయత్నించిందని తెలిపారు. అయితే యువత కోసం, ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలని.. అధికారం కోసం రాజకీయాలు చేయకూడదని కల్యాణ్ గారు నిర్ణయించారని [&hellip;]</p>

పవన్‌తో పొత్తుకు వైఎస్సార్సీపీ కూడా వెంపర్లాడింది: నాదెండ్ల
X

వైఎస్సార్సీపీ కూడా జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడిందని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించి కలకలం రేపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, చాలా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా పొత్తు కోసం ప్రయత్నించిందని తెలిపారు. అయితే యువత కోసం, ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలని.. అధికారం కోసం రాజకీయాలు చేయకూడదని కల్యాణ్ గారు నిర్ణయించారని ఆయన వెల్లడించారు.

ఆ నిర్ణయం మేరకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామని ఆయన తెలిపారు. అందుకే ప్రత్యేకంగా కొందరు యువకులను ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీకి నిలిపామని ఆయన చెప్పారు. ఇతర పార్టీలు డబ్బుంటే మొదట 10 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయమని అభ్యర్థులకు చెబుతున్నారని ఆరోపించారు. అలాంటి వారు సమాజానికి ఉపయోగపడతారా? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న అన్యాయంపై ఎవరు పోరాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. స్వార్థరాజకీయాలు చేయొద్దని, యువతకు అవకాశాలివ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. జనసేన సిద్ధాంతాలే పార్టీకి బలమని, కార్యకర్తలే వెన్నెముక అని ఆయన పేర్కొన్నారు.

tags :nadendla manohar, janasena, ysrcp, politics, rajahmundry,

Next Story