- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నాన్న చనిపోలేదు.. బతికే ఉన్నారంటూ ధర్మేంద్ర కూతురు పోస్ట్

దిశ, సినిమా: లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra)చనిపోయినట్లు గత రెండు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారని సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు, అభిమానులు అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈక్రమంలోనే ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లకు చెక్ పడలేదు. చనిపోయారంటూ గత రెండు రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయంపై ధర్మేంద్ర కూతురు ఈషా దేవోల్ (Eesha Deol) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘మా నాన్న చనిపోలేదు క్షేమంగా ఉన్నారు. మేం ప్రైవసీని కోరుకుంటున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని అక్షాంక్షించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇది క్షమించరానిది చికిత్స స్పందిస్తూ కోలుకుంటున వ్యక్తి గురించి బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి వార్తలను ఎలా రాయగలదు? ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది’’ అని రాసుకొచ్చింది.






