‘క్రాక్’ రిలీజ్ డేట్ ప్రకటించిన థమన్

by  |
‘క్రాక్’ రిలీజ్ డేట్ ప్రకటించిన థమన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రజెంట్ బీజీఎం వర్క్ జరుగుతోందని, థర్డ్ సింగిల్ రెడీ అయిపోయిందని తెలిపిన థమన్.. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతుందని, సినిమా లవర్స్‌కు క్రాక్ ఫెస్టివల్‌లా ఉండబోతుందని తెలిపారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా వస్తున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ క్రాక్‌లో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.


Next Story

Most Viewed