మూత్రవిసర్జనకు వెళ్లిన యువతి.. వెనకాలే వెళ్లిన యువకుడు..

by  |
మూత్రవిసర్జనకు వెళ్లిన యువతి.. వెనకాలే వెళ్లిన యువకుడు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆడది కనిపిస్తే పశువుల్లా మృగాళ్లు మీదపడుతున్న ఈ రోజుల్లో ఓ యువతి చేసిన ధైర్యం అందరి నోటా శభాష్ అనిపిస్తోంది. యువతిని కత్తితో బెదిరించి, అత్యాచారం చేయాలని ప్రయత్నించిన అతడికి తగిన బుద్ది చెప్పి కామాంధులకు హెచ్చరిక పంపింది. నీడలా వెంటాడిన అతడిని నిలువునా పాతిపెట్టింది. తమిళనాడులోని షోలవరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తిరువళ్లూర్‌కు చెందిన యువతి(19) ఇటీవల షోలవరంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది.
ఆమె శనివారం సాయంత్రం తన బంధువుల ఇంటి పక్కన ఉన్న గుర్రాల కొట్టంలోకి మూత్ర విసర్జనకు వెళ్లింది. అయితే ఆమెను కొద్ది రోజులుగా చాటుగా గమనిస్తున్న అజిత్ అలియాస్ కిల్లీ అనే యువకుడు ఆమె వెనకాలే వెళ్లాడు. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంలో ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారం చేయబోయాడు. షాక్ కు గురైన యువతి.. అతడి చర్యలను ప్రతిఘటించింది.

అయినా అజిత్ ఆమె మీదకు రావడంతో గట్టిగా వెనక్కు తోసేసింది. దీంతో అతడు కింద పడిపోయాడు. అతడి చేతిలోని కత్తి కూడా పక్కకు పడిపోయింది. క్షణాల్లో తేరుకున్న యువతి కిందపడిన కత్తిని చేజిక్కించుకుంది. వెంటనే అతడిపై కూర్చుని కత్తితో విచక్షణారహితంగా పొడిసింది. ముఖంపై, మెడపై కత్తితో పలుమార్లు పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇంటికి వచ్చిన ఆమె జరిగిందంతా బంధువులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి ఆత్మరక్షణ కోసమే హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. అత్యాచారయత్నం చేశాడనడానికి ప్రాథమిక ఆధారాలు సైతం సంఘటన స్థలంలో లభించాయి. కేసు నమోదు చేసిన షోలవరం ఇన్ స్పెక్టర్ నాగలింగం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పట్టారు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ యువతిపై ప్రజలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed