- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందా నగర్ లో పరువు హత్య..!
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ శివారులో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కూతురిని పెళ్లి చేసుకున్నాడని యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా హత్య చేయించాడు. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి గుండాలతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హత్య చేయించాడు. ఈ యువ జంట పెళ్లి తర్వాత గచ్చిబౌలి […]</p>

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ శివారులో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కూతురిని పెళ్లి చేసుకున్నాడని యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా హత్య చేయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి గుండాలతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హత్య చేయించాడు.
ఈ యువ జంట పెళ్లి తర్వాత గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలిలో ప్రేమజంటను కిడ్నాప్ చేయగా.. యువతి కారులో నుంచి పారిపోయింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. గచ్చిబౌలిలో కిడ్నాప్ కేసు నమోదు కాగా, సంగారెడ్డిలో యువకుడి హత్య కేసు నమోదైంది. ఈ హత్య ఎలా జరిగిందనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






