- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ పాటకు స్టెప్పులేసిన మున్సిపల్ చైర్మన్ దంపతులు, కమిషనర్
<p>దిశ, ఇల్లందు : తెలంగాణ రాష్ట్రం ఆచార సాంప్రదాయాలకు ప్రతీక. మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే వేడుక బతుకమ్మ పండుగ. మంగళవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో మునిసిపల్ మహిళా కౌన్సిలర్లు, పారిశుద్ధ కార్మికులు, మెప్మా సిబ్బంది ఆనందంగా ఆడుతూ పాడారు. బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బతుకమ్మ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేసిన ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు మహిళా […]</p>

దిశ, ఇల్లందు : తెలంగాణ రాష్ట్రం ఆచార సాంప్రదాయాలకు ప్రతీక. మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే వేడుక బతుకమ్మ పండుగ. మంగళవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో మునిసిపల్ మహిళా కౌన్సిలర్లు, పారిశుద్ధ కార్మికులు, మెప్మా సిబ్బంది ఆనందంగా ఆడుతూ పాడారు. బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా బతుకమ్మ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ఏర్పాటు చేసిన ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు మహిళా కౌన్సిలర్లు పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బతుకమ్మ పాటకు స్టెప్పులు వేసిన ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దంపతులు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, కమిషనర్ అంజన్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో 24 వార్డుల కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ కార్మికులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






