- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దగ్గినందుకు దాడి.. వ్యక్తి మృతి
<p>ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. దగ్గుతూ వీధిలో నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో బాధితుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే జిల్లా కళ్యాణ్‌కు చెందిన గణేశ్ గుప్త (34) నిత్యావసర వస్తువులు కొనేందుకు సమీప మార్కెట్‌కు వచ్చాడు. ఇదే సమయంలో పోలీసులు లాక్‌డౌన్ అమలును పరిశీలించడానికి అటుగా వచ్చారు. పోలీసులను చూసిన గణేశ్.. భయంతో వారికి దొరకకుండా వేరేమార్గంలో వెళ్తున్నాడు. […]</p>
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. దగ్గుతూ వీధిలో నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో బాధితుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే జిల్లా కళ్యాణ్‌కు చెందిన గణేశ్ గుప్త (34) నిత్యావసర వస్తువులు కొనేందుకు సమీప మార్కెట్‌కు వచ్చాడు. ఇదే సమయంలో పోలీసులు లాక్‌డౌన్ అమలును పరిశీలించడానికి అటుగా వచ్చారు. పోలీసులను చూసిన గణేశ్.. భయంతో వారికి దొరకకుండా వేరేమార్గంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో దగ్గు రావడంతో, అలానే దగ్గుతూ నడుస్తుండగా గమనించిన బాటసారులు.. గణేశ్‌ను కరోనా రోగిలా అనుమానించి దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు గణేశ్ మురుగు కాలువలో పడిపోయి, మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టానికి పంపించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.
Tags: mumbai, thane, corona, virus, covid 19, mumbai man beaten, corona suspector,






