బతుకమ్మ విగ్రహావిష్కరణ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క

39

దిశ,ములుగు : బతుకునిచ్చే బతుకమ్మ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు మండలంలోని ములుగు గ్రామం సర్పంచ్ బండారి నిర్మల హరినాదం ఆధ్వర్యములో గ్రామంలోని తోకుంట కట్ట పై బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క, ములుగు ఏ ఎస్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిలుగా హాజరైన విగ్రహావిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకునిచ్చే బతుకమ్మ అందరి కుటుంబాలలో వెలుగులు నింపి రైతుల పంట పొలాలు మంచిగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఉప సర్పంచ్ సుమలత కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..