పగలంతా శ్మశానాలకు తాళాలు.. రాత్రిళ్లు దహనాలు

by  |
పగలంతా శ్మశానాలకు తాళాలు.. రాత్రిళ్లు దహనాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తికి దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ కాలంలో అందరూ ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించిన సహాయ సహకారాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజనుల ఆకలి తీర్చడంలో సీతక్క ముఖ్య పాత్ర పోషించారు. ప్రజలను ఆదుకోవడమే కాకుండా ప్రభుత్వ లోపాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ ప్రశ్నిస్తుంటుంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ”ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా మూలంగా మరణించిన వారి వివరాలను ప్రభుత్వం కావాలనే దాస్తోందని తెలిపారు. కరోనా విజృంభణతో ఎంతో మంది మరణిస్తున్నారనడానికి కాలుతున్న చితిమంటలే సాక్ష్యమని, ఈ రుజువు సరిపోదా..? అని ఆమె ప్రశ్నించారు. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోను చూసి ఆమె స్పందించారు. ఈనెల 21న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ శ్మశానవాటికలో రాత్రివేళ ఒకేసారి 30 నుంచి 40 మృతదేహాలను దహనం చేశారని, వారు కొవిడ్‌తో మరణించిన విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. కరోనా మృతుల దహన సంస్కారాల కోసం హైదరాబాద్‌లో మూడు శ్మశానవాటికలను ప్రత్యేకంగా కేటాయించగా.. అక్కడ నిత్యం పదుల సంఖ్యలో ఖననాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయమై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సంప్రదించగా.. అవన్నీ సాధారణ మరణాలేనని కొట్టిపారేశారని, అదే నిజమైతే..

పగలంతా శ్మశానవాటికలకు తాళాలేసి రాత్రివేళ మాత్రమే ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. కరోనాపై అసెంబ్లీలో తేలిగ్గా మాట్లాడిన కేసీఆర్‌.. బయట కూడా అదే ధోరణి అవలంభిస్తున్నారని ఆసుపత్రుల్లో బెడ్లు లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంత విపత్కర పరిస్థితుల్లో కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం దృష్టి పెట్టడం దారుణం అన్నారు.

Next Story

Most Viewed