- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనకు మహిళలంటే చిన్నచూపు : సీతక్క
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహిళలంటే సీఎం కేసీఆర్‌కు చిన్న చూపని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ‘మహిళల సమస్యల కోసం ఒక జేఏసీ ఏర్పాటు కావాలి. అన్ని పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలుస్తామని వివరించారు. మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారు. తెలంగాణ మహిళా కమిషన్ కోసం బలమైన ఉద్యమం చేయాలన్నారు. బతుకమ్మ పేరు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలంటే సీఎం కేసీఆర్‌కు చిన్న చూపని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ‘మహిళల సమస్యల కోసం ఒక జేఏసీ ఏర్పాటు కావాలి. అన్ని పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలుస్తామని వివరించారు.
మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారు. తెలంగాణ మహిళా కమిషన్ కోసం బలమైన ఉద్యమం చేయాలన్నారు. బతుకమ్మ పేరు ఆయన కూతురు కవితమ్మకు మాత్రమే రావాలని కేసీఆర్ పరితపించారని విమర్శించారు. మహిళల జీవితాలను కేసీఆర్ బాగు చేస్తారన్న నమ్మకం నాకు లేదు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ తప్పులు మరుగున పడిపోతున్నాయి. నేను తెలుగుదేశం పార్టీలో ఎదిగిన మొక్కను. తెలుగుదేశం పార్టీ నా రాజకీయ పుట్టినిల్లు’ అని ఆమె వెల్లడించారు.
Next Story






